బీసీ కులాల పునర్వ్యవస్థీకరణ ?
రాష్ట్రంలోని బీసీ ఏ, బీ, సీ, డీ, ఈ లోని కులాలను పునర్వ్యవస్థీకరించాలని అనేక కుల సంఘా లు విజ్ఞప్తి చేస్తున్నాయని, ఇంటింటి సర్వే నివేదిక వచ్చిన తర్వాత ఆ దిశగా కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ వెల్లడించారు.
- సర్వే నివేదిక వచ్చాక ప్రతిపాదనలు రూపొందిస్తాం
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపైనా అభ్యంతరాలు వస్తున్నాయి
- ఇప్పటివరకు 1224 విజ్ఞప్తులు
- నేడు కూడా బహిరంగ విచారణ
- బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీసీ ఏ, బీ, సీ, డీ, ఈ లోని కులాలను పునర్వ్యవస్థీకరించాలని అనేక కుల సంఘా లు విజ్ఞప్తి చేస్తున్నాయని, ఇంటింటి సర్వే నివేదిక వచ్చిన తర్వాత ఆ దిశగా కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ వెల్లడించారు. అదీగాక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీ వర్గాలకు నష్టం వాటిల్లుతున్నదనే ఆధారాలను పలు సంఘాలు చూపుతున్నాయని, దీనిపైనా సానుకూల దృక్పథంతో దృష్టి సారిస్తామని తెలిపారు. ఉమ్మడి పదిజిల్లాల్లో తెలంగాణ బీసీ కమిషన్ చేపట్టిన బహిరంగ విచారణ ఇటీవలే ముగియగా, దానికి కొనసాగింపుగా ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి బహిరంగ విచారణను సోమవారం నిర్వహించారు.
ప్రజలు, వివిధ కుల సంఘాల నుంచి దరఖాస్తులను అభ్యర్థనలను స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ ఒక్కరోజే దాదాపు 58 వినతులు, సలహాలు, సూచనలు అఫిడవిట్ రూపం లో కమిషన్‌కి అందాయని వెల్లడించారు. బహిరంగ విచారణలో మొత్తం గా 1224 వినతులను స్వీకరించామని తెలిపారు. బీసీ జాబితాలో నుంచి తొలగించిన 26కులాలను తిరిగి చేర్చాలని కోరారని తెలిపారు. ఇంకా వినతులను సమర్పించాలనుకున్న వారు మంగళవారం కమిషన్‌లో జరిగే బహిరంగ విచారణలో పాల్గొనాలని సూచించారు. సమావేశంలో చైర్మన్ నిరంజన్‌తోపాటు, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్ , బాలలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

