జేఈఈ మెయిన్ సిలబస్ విడుదల
ఎంతో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ సిలబస్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. సెషన్-1, సెషన్-2 రెండింటి సిలబస్‌ను ఖరారు చేసింది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 20, గణితంలో 14 చొప్పున చాప్టర్లున్నాయి.
- ఫిజిక్స్, కెమిస్ట్రీలో 20, గణితంలో 14 చాప్టర్లు
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎంతో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ సిలబస్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. సెషన్-1, సెషన్-2 రెండింటి సిలబస్‌ను ఖరారు చేసింది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 20, గణితంలో 14 చొప్పున చాప్టర్లున్నాయి.
11,12 తరగతుల ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా ఈ పరీక్షను నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమయ్యింది. విద్యార్థులు నవంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 23 నుంచి 26 వరకు ఐప్లె చేయవచ్చు. 27 నుంచి 29వరకు దరఖాస్తుల్లోని తప్పులను సవరించుకోవచ్చు. డిసెంబర్ 30న సిటీ ఇంటిమేషన్ స్లిప్, 2027 జనవరి 13న అడ్మిట్‌కార్డు విడుదల చేస్తారు. పరీక్షలను 20,21,22,23,24,28 తేదీల్లో మూడు గంటలపాటు నిర్వహిస్తారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

