e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home టాప్ స్టోరీస్ అర్బన్‌.. హన్మకొండ రూరల్‌.. వరంగల్‌

అర్బన్‌.. హన్మకొండ రూరల్‌.. వరంగల్‌

అర్బన్‌.. హన్మకొండ రూరల్‌.. వరంగల్‌
  • జిల్లాల పేర్లు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌
  • అభ్యంతరాలకు నెల గడువు
  • ఆ తర్వాత ఫైనల్‌ గెజిట్‌

హైదరాబాద్‌, జూలై 12 (నమస్తే తెలంగాణ): వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మారుస్తూ రాష్ట్రప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు కొద్దిమార్పులతో వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల వరంగల్‌ పర్యటన సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల పేర్లు మారుస్తూ సోమవారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఉన్న దామెర, నడికుడ, పరకాల మండలాలతోపాటు పరకాల రెవెన్యూ డివిజన్‌ను ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలో కలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఉన్న ఖిలా వరంగల్‌, వరంగల్‌ మండలాలను ప్రతిపాదిత వరంగల్‌ జిల్లాలో కలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాల కలెక్టర్లకు రాతపూర్వకంగా తెలియజేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వచ్చిన అభ్యంతరాలను 30 రోజుల తర్వాత పరిశీలిస్తారు. సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని ఫైనల్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

ప్రతిపాదిత జిల్లాలు ఇలా…
ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలో వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన పరకాల రెవెన్యూ డివిజన్‌తోపాటు ఈ డివిజన్‌లోని దామెర, నడికుడ, పరకాల మండలాలు ఉన్నాయి. అలాగే వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోఉన్న వరంగల్‌ డివిజన్‌లోని కమలాపూర్‌ మండలాన్ని తాజాగా పరకాల డివిజన్‌లో కలిపారు. దీంతోపాటు కొత్తగా హన్మకొండ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేశారు. గతంలో వరంగల్‌ డివిజన్‌లో ఉన్న హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేర్‌, ధర్మసాగర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన హన్మకొండ రెవెన్యూ డివిజన్‌కు కేటాయించారు. ఇలా రెండు రెవెన్యూ డివిజన్లు 12 మండలాలు 139 గ్రామాలతో హన్మకొండ జిల్లాను ప్రతిపాదించారు. అలాగే వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోఉన్న వరంగల్‌ రెవెన్యూ డివిజన్‌ను వరంగల్‌ జిల్లాకు కేటాయించారు. దీనికి వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఉన్న వరంగల్‌, ఖిలా వరంగల్‌ మండలాలతోపాటు వరంగల్‌ రూరల్‌ రెవెన్యూ డివిజన్‌కు చెందిన గీసుకొండ, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం మండలాలు, పరకాల రెవెన్యూడివిజన్‌కు చెందిన ఆత్మకూరు, శ్యాంపేట మండలాలను వరంగల్‌ రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన నర్సంపేట రెవెన్యూ డివిజన్‌తోపాటు ఈ డివిజన్‌లోని నర్సంపేట, చెన్నరావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ మండలాలను ప్రతిపాదిత వరంగల్‌ జిల్లాలో కలిపారు. ఇలా రెండు రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు 217 గ్రామాలతో ప్రతిపాదిత వరంగల్‌ జిల్లాపై ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

- Advertisement -

హన్మకొండ
2 రెవెన్యూ డివిజన్లు
12 మండలాలు
139 గ్రామాలు

వరంగల్‌
2 రెవెన్యూ డివిజన్లు
15 మండలాలు
217 గ్రామాలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అర్బన్‌.. హన్మకొండ రూరల్‌.. వరంగల్‌
అర్బన్‌.. హన్మకొండ రూరల్‌.. వరంగల్‌
అర్బన్‌.. హన్మకొండ రూరల్‌.. వరంగల్‌

ట్రెండింగ్‌

Advertisement