Smart Helmet | ఝాన్సీ ఐడియా గ్రేట్.. ‘స్మార్ట్ హెల్మెట్’తో అంతర్జాతీయ ప్రదర్శనకు నిర్మల్ జిల్లా విద్యార్థిని
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రానికి చెందిన ఝాన్సీ స్మార్ట్ హెల్మెట్ రూపొందించి అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఝాన్సీ ఆరేండ్ల క్రితం ఐదో తరగతిలో ప్రవేశం పొందింది.
- ‘స్మార్ట్ హెల్మెట్’తో అంతర్జాతీయ ప్రదర్శనకు నిర్మల్ జిల్లా విద్యార్థిని
- రోమ్కు రావాలని ఆహ్వానం
- టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ విద్యార్థిని ఝాన్సీకి దక్కిన అరుదైన గౌరవం
Smart Helmet | సోన్, ఆగస్టు 14: నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రానికి చెందిన ఝాన్సీ స్మార్ట్ హెల్మెట్ రూపొందించి అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఝాన్సీ ఆరేండ్ల క్రితం ఐదో తరగతిలో ప్రవేశం పొందింది. ఆరో తరగతి చదువుతుండగానే.. ఆమె ప్రతిభను గుర్తించిన పాఠశాల సిబ్బంది కోడింగ్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు. అకాడమీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబర్చి హైదరాబాద్‌లోని కోడింగ్ అకాడమీ శిక్షణ కేంద్రంలో ఏడో తరగతిలో ప్రవేశం పొందింది. ప్రస్తుతం ఆమె పదో తరగతి చదువుతూనే ఇటీవల మైనింగ్ వర్కర్స్ కోసం(బొగ్గు కార్మికులకు) స్మార్ట్ హెల్మెట్‌ను రూపొందించింది. దీనిని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో గురుకుల పాఠశాలలో ఈ నెల 9న ప్రదర్శించింది. ఆర్డ్నియో ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ వారు పరిశీలించి ప్రదర్శనను ఇంటర్నేషనల్ స్థాయికి ఎంపిక చేశారు. అక్టోబర్ 20, 21, 22 తేదీల్లో ఇటలీ దేశంలోని రోమ్ పట్టణంలో దీనిని ప్రదర్శించడానికి రావాలని అక్కడి ప్రభుత్వం ఝా న్సీని ఆహ్వానించింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సుదర్శన్, గోదావరి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సరస్వతి, పాఠశాల సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్ హెల్మెట్‌తో ప్రయోజనాలు
స్మార్ట్ హెల్మెట్ పనితీరు విధానాన్ని విద్యార్థిని ఝాన్సీ వివరించింది. ‘కార్మికులు భూగర్భంలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటే నివారణకు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. భూమి లోపల కదలికలు వచ్చినా.. పైకప్పు కూలిపోయే ప్రమాదం ఉన్నా.. ముందుగానే గుర్తించి కార్మికులు అక్కడికి వెళ్లకుండా హెచ్చరిస్తుంది. కార్మికులు విధుల్లో ఉన్నప్పుడు ఒత్తిడికి గురై గుండె వేగం పెరిగితే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తుంది. కార్మికులు ఎక్కడైనా చిక్కుకుపోయి నా, స్పృహ కోల్పోయినా జీపీఎస్ ద్వారా కంప్యూటర్‌కు మెస్సేజ్ పంపుతుంది’ అని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

