ఖైరతాబాద్, సెప్టెంబర్ 30: ఆదాయానికి మించిన ఆస్తులో కేసులో అరెస్టయి 48 గంటలకు పైగా పోలీసు కస్టడీలో ఉన్న నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ నోరి లక్ష్మీభాసర్ను సస్పెండ్ చేస్తూ నిమ్స్ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. లక్ష్మీభాసర్పై ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని ఏసీబీ ఇన్స్పెక్టర్ నిమ్స్ అధికారులకు తెలియజేశారు.
డాక్టర్ లక్ష్మీ భాస్కర్ నుంచి ఓ కీలక డైరీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆ డైరీలో అతనితో ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తులతోపాటు పలువురు మీడియాకు చెందిన వారు కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆ పేర్ల ఆధారంగా ఒక్కొక్కరిని విచారిస్తూ, ఇండ్లలో సోదాలు జరుపుతున్న అధికారులు మరికొందరిని విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.