‘రామప్ప’కు రక్షణగా ఎన్జీటీ
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిం పు పొందిన రామప్ప దేవాలయానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ రక్షణగా నిలిచింది. ఆల యం, సరస్సు సమీపంలో సింగరేణి సంస్థ చే పట్టనున్న బొగ్గు తవ్వకాల కారణంగా జరిగే నష్టాలను పలు వార్తా కథనాల ద్వారా తెలుసుకున్న ఎన్జీటీ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది.
-
వార్తా కథనాల ఆధారంగా స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
-
కేంద్ర, రాష్ట్ర నియంత్రణ మండలికి నోటీసులు
ములుగు, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిం పు పొందిన రామప్ప దేవాలయానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ రక్షణగా నిలిచింది. ఆల యం, సరస్సు సమీపంలో సింగరేణి సంస్థ చే పట్టనున్న బొగ్గు తవ్వకాల కారణంగా జరిగే నష్టాలను పలు వార్తా కథనాల ద్వారా తెలుసుకున్న ఎన్జీటీ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. ఓసీ ముప్పుపై తొలిసారి ‘నమస్తే తెలంగాణ’ జూన్ 27న ‘రామప్పకు మైనింగ్ ముప్పు’ శీర్షికన కథనం ప్రచురించింది. వీటితోపాటు ఇతర వార్తా కథనాల ఆధారంగా దక్షిణాది జోనల్ కోర్టులో ఈ నెల 5న ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాత్స వ, అఫ్రోజ్ అహ్మద్‌తో కూడిన ధర్మాసనం కేసు నమోదుచేసి విచారణకు ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు ములుగు కలెక్టర్, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం, కేంద్ర భూగర్భ జల ప్రాధికార సంస్థను ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీచేసి ట్రిబ్యునల్ ముందు సమాధానాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఆదేశించింది.
సుమోటోగా కేసు స్వీకరణ
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని కాకతీయ రుద్రేశ్వరస్వామి ఆలయం (రామప్ప గుడి)తో పాటు చెరువు సమీపంలో సింగరేణి బొగ్గు తవ్వకాలకు సిద్ధమవుతూ పర్యావరణ నిబంధనలు, చట్టాలను పాటించడంలేదని ఎన్జీటీ గుర్తించి సుమోటోగా కేసు స్వీకరించింది. బొగ్గు తవ్వకాల సమీపంలో 800 ఏండ్ల నాటి ఇసుక దిబ్బ పునాదిగా ఉన్నదని, ఈ కట్టడానికి నష్టం వాటిల్లనున్నదని, ఈ విషయం పర్యావరణ సంరక్షణ చట్టం 1986ను ఉల్లంఘించేలా ఉన్నదని ఎన్జీటీ పేర్కొన్నది. పర్యావరణ నిబంధనల పాటింపు, నిర్దేశిత చట్టాల అమలుకు గణనీయమైన సమస్యలు లేవనెత్తనున్నాయని గుర్తించిన ట్రిబ్యునల్, ఇలాంటి విషయాలను సుమోటోగా స్వీకరించే అధికారం తమకున్నదని పేర్కొన్నది.
రామప్ప చెరువుకు 300 మీటర్ల దూరంలోనే తవ్వకాలు చేపట్టే ప్రతిపాదన ఉన్నదని ట్రిబ్యునల్ గుర్తించింది. ఈ తవ్వకాలతో చెరువులోని నీటి మట్టంలో మార్పులు సంభవించి భూ గర్భజలాల ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని పర్యావరణవేత్తలు వ్యక్తంచేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నది. ఈ కేసు దక్షణాది జోనల్ బెంచ్ పరిధిలోకి రావడంతో తదుపరి విచారణ నిమిత్తం కేసు రికార్డులను బదిలీచేసింది. ఎన్జీటీ చర్యలతో గుడితోపాటు చెరు వు పరిరక్షణపై పర్యావరణవేత్తలు, వారసత్వ కట్టడాల సంరక్షకులు, స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వెంకటాపూర్ సమీప ప్రాంతం లో బొగ్గును వెలికితీసేందుకు 2010లోనే స న్నాహాలు చేపట్టగా పురావస్తు శాఖ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో నిలిపివేశారు. సెప్టెంబర్‌లో బొగ్గు తవ్వకాలకు సింగరేణి అధికారులు మరోమారు సన్నద్ధమవగా వార్తాకథనాల ద్వారా వాస్తవాలను తెలుసుకున్న ఎన్జీటీ సుమోటోగా కేసు స్వీకరించడంతో రామప్ప శివారులో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

