కాలయాపనకే కొత్త పెన్షన్‌పై కమిటీ
నూతన పెన్షన్ విధానంపై కమిటీని ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన గర్హనీయమని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ తెలిపారు.
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన గర్హనీయం
- ఎన్‌ఎంవోపీఎస్ సెక్రటరీ జనరల్
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): నూతన పెన్షన్ విధానంపై కమిటీని ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన గర్హనీయమని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ తెలిపారు. కమిటీలతో కాలయాపన చేయకుండా పాత పెన్షన్ స్కీంను అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి ప్రకటన సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమే అవుతుందని పేర్కొన్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, గతంలో పాత పెన్షన్‌ను పునరుద్ధరించే ప్రతిపాదనేది లేదని తెలిపిన కేంద్రం నేడు కమిటీని ప్రతిపాదించడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానాలో సీపీఎస్ ప్రభావంతో ఓటమి తప్పదని గ్రహించే ఇలా కంటి తుడుపు ప్రకటన చేశారని మండిపడ్డారు. పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దుచేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

