ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
- నూతన సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు..
- రెండ్రోజుల వర్క్‌షాప్ పూర్తి
- తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం ఈ సంవత్సరమే అందుబాటులోకి
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఓపెన్ ఇంటర్‌కు ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త కరిక్యులం, సరికొత్త సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) కసరత్తు ముమ్మరం చేసింది. తొలిదశలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, అరబిక్, ఉర్దూ పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నారు. రెండో విడతలో గణితం, జీవశాస్త్రం సహా ఇతర సబ్జెక్టులకు కొత్త కరిక్యులాన్ని రూపొందిస్తారు. కొత్త పుస్తకాలు ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొందిన వారికి అందుబాటులోకి వస్తాయి. కరిక్యులం రూపకల్పనలో తెలంగాణ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మన చరిత్ర, సంస్కృతి, భాష, సాహితీవేత్తలు, రచయితలకు చోటు కల్పిస్తున్నారు. ఈ పుస్తకాల తయారీకి ఎస్సీఈఆర్టీ ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజులపాటు వర్క్‌షాప్ నిర్వహించింది. వర్సిటీల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీల అధ్యాపకులు, ఎస్సీఈఆర్టీ విషయ నిపుణులతో మొత్తం ఎనిమిది కమిటీలు వేశారు.
ఎన్సీఈఆర్టీ ప్రమాణాల మేరకు..
ఇంటర్ విద్యార్థుల కోసం రాష్ట్రంలో 935 స్టడీ సెంటర్లున్నాయి. ఏటా 35 వేల నుంచి 40 వేల మంది వీటి ద్వారా ప్రవేశాలు పొందుతున్నారు. వీరికి ఇన్నాళ్లుగా నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ పుస్తకాల ఆధారంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. పూర్తిగా ప్రశ్నలు, సమాధానాలతో కూడిన ఈ మెటీరియల్‌పై ఆధారపడటం వల్ల విద్యార్థులకు పాఠ్యాంశాలపై సమగ్ర అవగాహన ఉండటంలేదు. పైగా అవి విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదం చేయడం లేదన్న వాదనలున్నా యి. ఈ నేపథ్యంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండ లి (ఎన్సీఈఆర్టీ) కరిక్యులం మార్గదర్శకాల ప్రకారం పాఠ్యపుస్తకాల తయారీకి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. నిరుడు ఎస్సెస్సీ వారికి కొత్త పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంటర్ పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు.
ఓపెన్‌లోనూ తెలుగు తప్పనిసరి
తెలుగు తప్పనిసరి అమలు చట్టం-2018 ద్వారా రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో తెలుగు బోధన అనివార్యమైంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల స్కూళ్లల్లో 1 -10 తరగతి వరకు తెలుగును బోధించాల్సిన పరిస్థితి ఈ చట్టం ద్వారా ఏర్పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- New Curriculum
- open inter
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

