పచ్చి మంచి నీళ్లూ ముట్టలే!
ఆదరణ ముసుగులో అవమానించడం, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాషాయ దళపతుల నైజమని మరోసారి తేటతెల్లమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనలో బీజేపీ దళిత కార్యకర్త కు ఘోర అవమానం జరిగింది.
- దళితుడి ఇంట భోజనమని ప్రచారం
- చాయ్‌కే పరిమితం.. అదీ బయటిదే
- ఇదీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీరు
- బీజేపీది మొదటి నుంచి ఇదే తంతు
- అణగారినవర్గాలకు అవమానాలు
- షాపై నెటిజన్లు, దళిత నేతల ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఆదరణ ముసుగులో అవమానించడం, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాషాయ దళపతుల నైజమని మరోసారి తేటతెల్లమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనలో బీజేపీ దళిత కార్యకర్త కు ఘోర అవమానం జరిగింది. దళిత కార్యక ర్త ఇంట్లో అమిత్‌షా భోజనం చేస్తారని విస్తృత ప్రచారం కల్పించారు. కానీ, ఆ కార్యకర్త ఇం ట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా వివ క్ష చూపారు. ఇంట్లో చేసిన చాయ్ కూడా రుచి చూడలేదు. బయట నుంచి బ్లాక్ టీ తెప్పించుకొని తాగారు. దళితుల పట్ల బీజేపీ నేతల కపట ప్రేమకు ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన ఘటనే నిదర్శనం. అమిత్ షా తీరుపై నెటిజన్లు, దళిత మేధావులు సోషల్‌మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ అసలు సంగతి..
నల్లగొండ జిల్లా మునుగోడులో ఆదివారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తరుణ్‌చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి సికింద్రాబాద్ సాంబమూర్తినగర్లోని బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. బీజేపీ దళిత కార్యకర్త ఇంట్లో అమిత్‌షా భోజనం చేస్తారని, ఇరానీ చాయ్ రుచి చూస్తారని మూడు రోజులుగా జోరుగా ప్రచారం చేసుకున్నారు. కానీ, సత్యనారాయణ ఇంట్లో కనీసం మంచినీళ్లు కూడా ముట్టలేదు. వెంట తీసుకెళ్లిన వాటర్ బాటిళ్ల నీళ్లను తాగారు. బయటి నుంచి తెప్పించిన బ్లాక్‌టీ తాగి బయటపడ్డారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం అనంతరం ఇప్పటికీ దళితుల ఇంటికి వెళ్లడం గొప్పగా బీజేపీ చెప్పుకోవడం సిగ్గుచేటంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు చురకలు అంటించారు.
వివక్ష చూపడంపై నెటిజన్ల మండిపాడు
అమిత్‌షా, బీజేపీ నేతల రాజకీయాలపై నెటిజన్లు, దళిత మేధావులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికీ దళితుడి ఇంటికి వెళ్లడం, భోజనం చేయడం, నీళ్లు తాగడం వంటి అంశాలను బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకుంటూ సమసిపోతున్న వివక్షను మరింతగా తరచి చూపుతున్నారంటూ నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ పొలిటికల్ గేమ్‌లో అమాయక దళితవర్గాలను పావులుగా మార్చుతున్నారని దళిత మేధావులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత జన అభ్యున్నతిపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, ఇలాంటి జిమ్మిక్కులు మానుకోవాలని సోషల్‌మీడియాలో హోరెత్తిస్తున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న దళితబంధు వంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి బీజేపీ సర్కారు తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సూచిస్తున్నారు.
ఆది నుంచీ ఇదే తంతూ..
ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి వెళ్లడం, ఇలాంటి జిమ్మికులు చేయడం బీజేపీ నేతలకు పరిపాటిగానే మారింది. అందులో అమిత్‌షా మినహాయింపేమీ కాదని మరోసారి రుజువైంది. గతంలో తెలంగాణ పర్యటనకు అమిత్‌షా వచ్చినప్పుడు తెరాట్‌పల్లిలో దళితుడి ఇంట్లో భోజనం చేస్తానని ప్రకటించారు. కానీ, సమీపంలోని కమ్మగూడెం సమీపంలోని ఓ అగ్రనాయకుడి మామిడితోటల్లో వంటలు వండించుకొని, వాటినే దళితుడి ఇంటికి తీసుకెళ్లి భోజనం చేసి కించపర్చారు. పెద్దదేవులపల్లిలోనూ ఇదే తీరుగా వ్యవహరించారు. అన్నపూర్ణ మెస్ నుంచి భోజనం తెప్పించుకొని దళితుడి ఇంట్లో భోజనం చేసినటు ఫోజులు కొట్టారు. అమిత్‌షా ఒక్కరే కాదు యూపీ సీఎం ఆదిత్యనాథ్, అనేక మంది కేంద్రమంత్రులు కూడా ఇదే తరహాలో దళితులను అవమానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

