Viral news | కుక్కల దాడిలో చచ్చిన కోడి.. మున్సిపల్ ఆఫీస్ గుమ్మానికి వేలాడదీసి యజమాని నిరసన..!
Viral news | కుక్కల దాడిలో కోడి చనిపోవడంతో దాన్ని మున్సిపల్ కమిషనర్ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి నిరసన వ్యక్తం చేశాడో వ్యక్తి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణానికి చెందిన యువకుడు అజీజొద్దీన్ తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేశాయని, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోతూ కోడి కళేబరంతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.
- సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం
కొత్తపల్లి, జనవరి 23: కుక్కల దాడిలో కోడి చనిపోవడంతో దాన్ని మున్సిపల్ కమిషనర్ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి నిరసన వ్యక్తం చేశాడో వ్యక్తి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణానికి చెందిన యువకుడు అజీజొద్దీన్ తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేశాయని, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోతూ కోడి కళేబరంతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. గమనించిన కమిషనర్ వేణుమాధవ్, అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అజీజొద్దీన్ చేసేదేమీలేక కోడిని కమిషనర్ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి కొత్తపల్లి పట్టణ ప్రజల వాట్సాప్ గ్రూప్‌లో ఓ ఆడియోను విడుదల చేశారు.
‘గత మూడున్నరేండ్లుగా కొత్తపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కనీసం వీధి కుక్కల నుంచి ప్రజలను, కోళ్లను కాపాడాలని గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. సోమవారం నా ఇంట్లోకి కుక్కలు చొరబడి కోడిని చంపేశాయి. ఒక వేళ పిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉండేది? మీరే ఆలోచించుకోవాలి’ అంటూ ఆడియోలో పేర్కొన్నారు. ఆఫీసు గుమ్మానికి కోడిని వేలాడదీయడంపై కమిషనర్ వేణుమాధవ్ కరీంనగర్ సీపీతోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కుక్కల దాడిలోనే కోడి చనిపోయిందా? లేదా? అనే విషయమై విచారణ జరిపిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

