సీయూఈటీ పీజీ పరీక్ష 90 నిమిషాలే.. ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల
నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పీజీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2026-27 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 మార్చిలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
- దరఖాస్తుల స్వీకరణ షురూ
- జనవరి 14 వరకు తుది గడువు.. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పీజీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2026-27 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 మార్చిలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో 90 నిమిషాలు/గంటన్నరపాటు నిర్వహిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమయ్యింది. అభ్యర్థులు 2026 జనవరి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలు, కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 292 ప్రధాన నగరాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. దేశం వెలుపల గల 16 నగరాల్లోను పరీక్షలు జరుగుతాయి. మొత్తం 157 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఇవ్వనుండగా, తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత పెడతారు.
మరికొన్ని విశేషాలు..
- విదేశాల్లోని భారతీయ విద్యార్థుల కోసం అంతర్జాతీయ పరీక్షకేంద్రాల సంఖ్యను 312కు పెంచారు. కొత్తగా అబుదాబి, ఓస్లో నగరాల్లో కొత్త పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు.
- పరీక్ష సెంటర్లను ఈ సారి నాలుగుకు పెంచారు. అభ్యర్థి తనకు సమీపంలోని ఏదైనా నాలుగు నగరాలు ఎంచుకోవచ్చు.
- దరఖాస్తు ఫీజులను ఈసారి పెంచారు. జనరల్ క్యాటగిరీ అభ్యర్థుల ఫీజును రెండు సబ్జెక్టులకు రూ. 200 పెంచారు.
- జనరల్ ఆప్టిట్యూడ్ పేపర్‌ను రద్దుచేశారు. ఇది వరకు ఈ పేపర్‌తోపాటు, సంబంధిత సబ్జెక్టు పేపర్లకు పరీక్షలు రాయాల్సి ఉండేది.
- రాష్ట్రంలో కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెం, హైదరాబాద్, సికింద్రాబాద్‌లో సెంటర్లు ఏర్పాటు చేస్తారు.
షెడ్యూల్ ఇలా..
- దరఖాస్తుల సమర్పణకు తుది గడువు 14 జనవరి 2026
- ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ 14 జనవరి 2026 రాత్రి 11:50 వరకు
- దరఖాస్తుల్లో తప్పుల సవరణ 18,19, 20 జనవరి రాత్రి 11:50 గంటల వరకు
- అడ్మిట్‌కార్డుల విడుదల పరీక్షకు వారం రోజుల ముందు పరీక్షలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

