హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ క్యాటగిరీలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
దేశంలోని కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఐదేండ్లపాటు బోధనానుభవం కలిగి ఉండి 55 ఏండ్ల లోపువారు awards.gov.in వెబ్సైట్ను సంప్రదించి జూలై 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.