హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ రీ ఎగ్జామ్ ఫలితాల్లో ఆలిండియా ఆల్ క్యాటగిరిల్లో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో ఆర్యన్ గుప్తా 1వ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించాడు. గౌరవ్సింగ్ 9వ ర్యాంకు, క్రిష్ గుప్తా 15వ ర్యాంకు, కార్తీక్ చౌదరి 16వ ర్యాంకుతో సంచలనం సాధించారు. వీటితో పాటు 22,30, 31,35, 39,50, 56,58,71,72, 76,78,79, 97 వంటి 100లోపు 18 ర్యాంకులు, 1000 లోపు 49 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
ఆలింగియా అన్ని కేటగిరీల్లో 1,1,2,3,3,9,9,11,12 వంటి 9 ర్యాంకులు, 100 లోపు 45 ర్యాంకులు, 1000 లోపు 163 ర్యాంకులు సాధించి సరికొత్త రికార్డు నెలకొలపి ఆలిండియా అగ్రగామిగా నిలిచిందని నారాయన విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణినారాయణ హర్షం వ్యక్తంచేశారు. ఇంతటి ఘన విజయానికి కారణమైనే విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులకు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత కొత్తప అభినందనలు తెలియజేశారు.