హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్స్-2026 ఫలితాల్లో టాప్ ర్యాంక్‌లతో నారాయణ విద్యాసంస్థలు సత్తా చాటాయి. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 10, 14, 17, 19, 21, 23, 24, 25 ర్యాంక్లతోపాటు 100 లోపు 24, 1000 లోపు 165 ర్యాంక్‌లు సాధించినట్టు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర, శరణి,రమానారాయణ వెల్లడించారు.
ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 10, 14, 17, 19, 21, 23, 24, 25, 27, 29, 32, 37, 40, 44, 56, 61, 64, 66, 73, 74, 76, 97 ర్యాంక్‌లతో నారాయణ జైత్రయాత్ర కొనసాగినట్టు తెలిపారు. అన్ని క్యాటగిరీల్లో 1, 1, 6, 7, 9, 10 ర్యాంక్‌లతో టాప్-10లో 6 ర్యాంక్లతోపాటు 100లోపు 48 ర్యాంక్‌లు, 1000 లోపు 750 ర్యాంక్‌లు సాధించినట్టు చెప్పారు.