ఫొటో జర్నలిస్టు కుటుంబానికి అండగా..
ఫొటో జర్నలిస్టు రాజేశ్ కుటుంబానికి నమస్తే తెలంగాణ దినపత్రిక అండగా నిలిచింది. సుదీర్ఘకాలంగా సంస్థలో పనిచేసిన రాజేశ్ ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించారు.
- సుమారు రూ.10 లక్షలు అందజేసిన ‘నమస్తే తెలంగాణ’
- ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించిన రాజేశ్
హైదరాబాద్, సిటీబ్యూరో, జూన్ 21 ( నమస్తే తెలంగాణ ): ఫొటో జర్నలిస్టు రాజేశ్ కుటుంబానికి నమస్తే తెలంగాణ దినపత్రిక అండగా నిలిచింది. సుదీర్ఘకాలంగా సంస్థలో పనిచేసిన రాజేశ్ ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించారు. ఆ కుటుంబానికి తోడ్పాటును అందించేందుకు నమస్తే తెలంగాణ ఉద్యోగులు, యాజమాన్యం కలిసి సుమారు రూ.10 లక్షలు పోగుచేశారు. ఇందుకు సంబంధించిన చెక్కులను శుక్రవారం హైదరాబాద్‌లోని పత్రిక ప్రధాన కార్యాలయంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే దినపత్రిక ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి, సంస్థ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, చీఫ్ ఫొటోగ్రాఫర్ గంగాధర్, సీనియర్ ఫొటోగ్రాఫర్ రజినీకాంత్ కలిసి రాజేశ్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రాజేశ్ సతీమణి లావణ్య మాట్లాడుతూ.. పెద్ద దిక్కును కోల్పోయి కష్టాల్లో ఉన్న తమకు నమస్తే తెలంగాణ అండగా నిలవడం ధైర్యాన్నిచ్చిందని తెలిపారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న సంస్థకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. రాజేశ్ కుమార్తె శివాని 9వ తరగతి, చదువుతుండగా, బాబు వర్షిత్ 7వ తరగతి చదువుతున్నారు. కాగా, తెలంగాణ ఉద్యమకాలంలో అమరుడు సిరిపురం యాదయ్య ఆత్మబలిదానం చేస్తుండగా రాజేశ్ తీసిన ఫొటో ఎందరినో కదిలించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

