Nagarjuna Sagar | సీఆర్పీఎఫ్ ఆధీనంలోకి నాగార్జున సాగర్
సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలు డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఒక్కో పాయింటును స్వాధీనం చేసుకుంటున్నాయి.
నాగార్జున సాగర్: నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దురాక్రమించిన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు 13 గేటు వరకు తమదేనంటూ ఏపీ పోలీసులు బారికేడ్లు, ముళ్ల కంచెలు వేశాయి. దీంతో తెలంగాణ పోలీసులు కూడా ప్రాజెక్టు పరిసరాల్లో భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను కృష్ణా బోర్డు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. దీంతో సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలు డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఒక్కో పాయింటును స్వాధీనం చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం వరకు ప్రాజెక్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. కాగా, సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.
కాగా, సాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కీలక సమాశం జరుగుతున్నది. రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశమయ్యారు. కేంద్ర జలసంఘం, కేఆర్ఎంబీ అధికారులు నేరుగా హాజరుకాగా, ఇరు రాష్ట్రాల కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సాగర్, శ్రీశైలం డ్యాం, రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యలు, వాటి పరిధిలో ఉన్న అనుబంధ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు బదిలీచేసే అశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

