Motkupalli Narasimhulu | ఇది సోనియా కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్: మోత్కుపల్లి నర్సింహులు
సీఎం రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణభయం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. వంద రోజుల్లోనే ఆయన నైజం బయటపడిందని విమర్శించారు. రేవంత్ తీరుతో మాదిగలు 50 ఏండ్లు వెనక్కి పోయారని చెప్పారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణభయం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. వంద రోజుల్లోనే ఆయన నైజం బయటపడిందని విమర్శించారు. రేవంత్ తీరుతో మాదిగలు 50 ఏండ్లు వెనక్కి పోయారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాలు రెడ్డిలకే ఇచ్చారని, బలహీనవర్గాల నేతలు పార్లమెంటుకు పోవద్దా అని ప్రశ్నించారు. బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారని ప్రశ్నించారు. రెడ్డి రాజ్యాన్ని స్థాపించడమే రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ మాదిగలకు రెండు టికెట్లు ఇచ్చారు.. కాంగ్రెస్ ఒక్క టికెట్ ఇవ్వలేదన్నారు. ఇది సోనియా కాంగ్రెస్ కాదని.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని చెప్పారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి అని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. దేవుళ్లపై ఒట్లు పెట్టిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. దళితబంధు సంగతి ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ రూ.10 లక్షలు ఇస్తే.. నువ్వు రూ.12 లక్షలు ఇస్తా అన్నవు ఏమైందని నిలదీశారు. దళితబంధు పథకం అద్భుతం.. కేసీఆర్ రూ.30 వేల కోట్లు ఖర్చుపెట్టారని చెప్పారు. వెంటనే దళితబంధును అమలు చేయాలన్నారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని, ఎందుకు అమలు చేస్తలేవని ప్రశ్నించారు. తాను మాదిగ జాతికి కాపలాదారుడినని తెలిపారు. మాదిగలు, బలహీనవర్గాల ప్రజలు కాంగ్రెస్ ఓటెయ్యొద్దని పిలుపునిచ్చారు.
కడియం శ్రీహరి కులం ఏంటో తెల్వదని చెప్పారు. శ్రీహరీ నీకు సిగ్గుందా.. కేసీఆర్‌ను మోసం చేసి పోతవా అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు ఇచ్చిన కేసీఆర్.. నీకు ఏం తక్కువ చేశారని నిలదీశారు. నీ బిడ్డకు టికెట్ ఇచ్చినా మోసం చేసి వెళ్లిపోతావా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కడియం శ్రీహరి మాల కాదు, మాదిగ కాదు, వాళ్ల నోటి కాడా ముద్ద లాక్కుంటున్నాడు అని ఆయన మీద విచారణ చేయాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన్ని సంకన ఎక్కించుకున్నాడని విమర్శించారు.
కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం పదవి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కూతురుకి ఎంపీ టికెట్, డబ్బులు అన్ని తీసుకొని బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు.. ఇదేం నియ్యతి.
కడియం శ్రీహరి మాల కాదు మాదిగ కాదు వాళ్ల నోటి కాడా ముద్ద లాక్కుంటున్నాడు అని ఆయన మీద విచారణ చేయాలన్న రేవంత్… pic.twitter.com/8aftLNhoIh
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2024
రేవంత్ రెడ్డి దొర
రేవంత్ రెడ్డికి ఎంతసేపూ పైరవీకార్లు, డబ్బున్న వాళ్లే కావాలి.. రంజిత్ రెడ్డిని వాడు కోడిగుడ్లు అమ్ముకునేటోడు, బోడగుండు అని తిట్టి మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నాడు రెడ్డి దొర – కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు pic.twitter.com/wrZE7lzlo0
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

