హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : ఈ నెలాఖరు వరకు నగరంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. ఆదివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, అడపాదడపా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్ష సూచన ఉన్నట్టు పేర్కొన్న ది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ వెల్లడించింది.