హైదరాబాద్, జూలై 2,(నమస్తే తెలంగాణ): ఎంప్లాయీస్ హెల్త్ సీమ్ ప్రయోజనాలను మోడల్ సూల్స్ రెగ్యులర్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వర్తింపజేయాలని ప్రోగ్రెసివ్ మోడల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ డిమాండ్ చేసింది. గురువారం పీఎంటీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డితో కలిసి నూతన సీఎస్ సంజయ్ జాజుకు వినతిపత్రం సమర్పించారు.