హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కువైట్‌లో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కువైట్ శాఖ అధ్యక్షురాలు గొడిశాల అభిలాష కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితకే దక్కిందని కొనియాడారు. మహిళల సమస్యలపై, వారి హక్కులపై పోరాడుతున్న కవిత అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సురేశ్‌గౌడ్, ప్రమోద్‌కుమార్, అయ్యప్ప, రవి సుధగాని
తదితరులు పాల్గొన్నారు.