ఎమ్మెల్సీ కవిత అరెస్టు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అత్యం త నాటకీయంగా.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎలాంటి ట్రాన్సి ట్ వారంట్ లేకపోయినా కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ.. రాత్రి 8.45కు ఢిల్లీకి తరలించారు.
- ఢిల్లీ మద్యం కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు
- మధ్యాహ్నం నుంచి ఆరు గంటల పాటు ఆమె ఇంట్లో సోదాలు
- సాయంత్రం ట్రాన్సిట్ వారంట్ లేకుండానే అదుపులోకి..?
- ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై మండలి చైర్మన్‌కు సమాచారం
- రాత్రి 8.45కి ఢిల్లీకి కవిత తరలింపు
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అత్యం త నాటకీయంగా.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎలాంటి ట్రాన్సి ట్ వారంట్ లేకపోయినా కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ.. రాత్రి 8.45కు ఢిల్లీకి తరలించారు. పన్నెండు మంది ఈడీ అధికారుల బృందం శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకే కవిత ఇంటి వద్ద మోహరించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ వాయిదా పడిన వెంటనే 1.45 గంటలకు కవిత ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోకి రావడంతోనే సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లు, కవిత వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు, కవిత ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తనిఖీల పేరుతో ఆమె ఇంట్లో నానా హంగామా సృష్టించిన ఈడీ అధికారులు.. డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 6.45 గంటల వరకూ సోదాల పేరుతో కాలయాపన చేశారు. కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయనే సమాచారం మీడియాకు చేరుకునేలోపే ఇంటి మొ త్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఐటీ పేరుతో మీడియాను దారిమళ్లించి..
కవిత ఇంట్లో సోదాలు జరుపుతున్నది ఇన్ కం ట్యాక్స్ అధికారులంటూ బీజేపీ అనుకూల మీడియా వార్తలు ప్రసారం చేసింది. మధ్యా హ్నం 4 గంటల వరకూ కవిత ఇంట్లో సోదా లు జరుపుతున్నది ఈడీ అధికారులనే విష యం తెలియరాలేదు. చాలా పకడ్బందీగా మీడియాను సైతం తప్పుదోవ పట్టించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈడీ అధికారులు కవిత స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కవిత భర్త అనిల్‌కు ట్యాబ్లెట్లు ఇచ్చేందుకు పనిమనుషులను కూడా అనుమతించలేదు. బీఆర్ఎస్ లీగల్ టీమ్‌కు చెందిన సోమ భరత్‌కుమార్ సుప్రీంకోర్టు తీర్పులతో ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కనీసం గేటు కూడా తెరవకపోవడంతో ఆయన వెనుదిరిగారు. మళ్లీ ఆయనను పిలిపించి.. సోదా లు మాత్రమే జరుపుతున్నామని నమ్మించారు. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుండగా.. అనుమతులు లేకుండా సోదాలు ఎలా చేస్తారని తాను ఈడీ అధికారులను ప్రశ్నించినట్టు సోమభరత్ మీడియాకు చెప్పారు. బీఆర్ఎస్, భారత జాగృతి కార్యకర్తలు, మాజీ నేతలు పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకొని, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
కేటీఆర్, హరీశ్‌కూ అనుమతి నిరాకరణ
కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారనే విషయం తెలుసుకున్న మా జీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి అక్కడికి చేరుకోగా, వారికి సైతం అనుమతి నిరాకరించారు. కార్యకర్తలు ఒక్కసారిగా గేటు వద్దకు దూసుకురావడంతో ఉద్రి క్తత నెలకొన్నది. ‘ఇదేమి దౌర్జన్యం కనీసం నా చెల్లిని కూడా చూడనివ్వరా’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ గేటు తెరిచే ప్రయత్నం చేశారు. హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్, జాగృతి కార్యకర్తలంతా కేటీఆర్ వెనుక నిలువగా.. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో ఈడీ అధికారులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డిని లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్లిన కేటీఆర్.. వివరాలు తీసుకొని ట్రాన్సిట్ వారంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఈడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ భానుప్రియ మీనాను ప్రశ్నించారు.
అదే చెరగని చిరునవ్వుతో..
సాయంత్రం వరకూ కవిత అరెస్టు విషయా న్ని దాచిపెట్టిన ఈడీ అధికారులు.. సాయం త్రం 5 గంటల తర్వాత శాసనమండలి చైర్మన్‌కు సమాచారం ఇచ్చారు. ఆమెను నిబంధనల ప్రకారం, పక్కా ఆధారాలతో అరెస్టు చేస్తున్నామని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగీందర్ తెలిపారు. అనంతరం కవితను 5.20కి అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. దాదాపు 14 పేజీలతో కూడిన రిపోర్టును కవితకు అందజేశారు. తన వాదనకు వ్యతిరేకంగా అరెస్టు చేస్తున్నా.. ఎమ్మెల్సీ కవిత శాంతియుతంగా వారికి సహకరించారు.
అభివాదం చేస్తూ ముందుకు..
ఇంటినుంచి బయలుదేరేముందు ఎమ్మెల్సీ కవిత పిడికిలి ఎత్తి నినదించారు. ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని కారులో ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమవగా.. చిన్న కొడుకు ఆదిత్యను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆదిత్య నుదుటిపై ముద్దు పెట్టి, ధైర్యం చెప్పారు. కొడుకు కన్నీటి పర్యంతమవుతుండగా తలనిమిరి.. వెన్నుతట్టి సముదాయించారు. మెట్లు దిగుతూ చిరునవ్వుతో అభివాదం చేస్తూ కవిత ముందుకు కదిలారు. అనంతరం కారు ఎక్కేముందు భర్త అనిల్‌ను హత్తుకొని ఉద్వేగానికి గురయ్యారు. కాసేపు మేడే రాజీవ్‌సాగర్, శరత్‌తో మాట్లాడారు. కవిత అరెస్టుపై నిరసనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నాయకులు, పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మేడే రాజీవ్సార్, ఆంజనేయులుగౌడ్, నాయకులు రజినీ, గట్టు రామచంద్రయ్య, రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

