భావజాల మార్పు కోసం కృషి
ఆధిపత్య ధోరణుల నుంచి ప్రజల్లో మార్పు కోసం తెలంగాణ రచయితల సంఘం విశేష కృషి చేసిందని ఎమ్మెల్సీ, కవి-రచయిత దేశపతి శ్రీనివాస్ కొనియాడారు.
- 12 ఏండ్లుగా తెరసం సాహితీ సేవ
- ఎమ్మెల్సీ, కవి-రచయిత దేశపతి
- నేటి జెన్‌జీ తరం ఆలోచనలకు అనుగుణంగా కవి చర్చించాలి
- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి
రవీంద్రభారతి, నవంబర్ 1: ఆధిపత్య ధోరణుల నుంచి ప్రజల్లో మార్పు కోసం తెలంగాణ రచయితల సంఘం విశేష కృషి చేసిందని ఎమ్మెల్సీ, కవి-రచయిత దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భావజాల మార్పుకోసం పనిచేసిందని గుర్తుచేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ రచయితల సంఘం 12 ఏండ్ల సభలు, వర్తమాన సాహిత్యం-తెలంగాణ సంభాషణ సభలు ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ నాళేశ్వరం శంకరం సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
మన చుట్టూ ఇవాళ గుండెను పిండే ఘటనలు జరుగుతున్నాయని, హింస, మతోన్మాదంతో మనిషి మానవత్వం కోల్పోతున్నాడని ఆందోళన వ్యక్తంచేశారు. మతశక్తులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం కవులు, కళాకారులకు ఉన్నదని పేర్కొన్నారు. జెన్‌జీ తరం ఆలోచనలకు అనుగుణంగా నేటి రచయిత చర్చ పెట్టాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి పిలుపునిచ్చారు.
విమర్శలను తట్టుకోలేని పరిస్థితి ఆరోగ్యకరమైనది కాదని హితవు పలికారు. తెలుగు కవి ఎటు ఆలోచించాలనే విషయాలను సంచాకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి వివరించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సీనియర్ పాత్రికేయులు విరాహత్ అలీ, బైస దేవదాస్, డాక్టర్ వీ శంకర్ తదితరులు ప్రసంగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

