MLA Sabitha | గవర్నర్ వల్లే ఆ కులానికి అన్యాయం జరిగింది : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
MLA Sabitha | ఎరుకల సమాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం చేశారని మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు.
బడంగ్‌పేట, డిసెంబర్31 : ఎరుకల సమాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం చేశారని మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న చందన చెరువు కట్టపై ఏకలవ్యుని విగ్రహాన్ని(Ekalavya statue) ఎమ్మెల్సీ యెగ్గె మల్లేష్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఎరుకల సంఘం నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ ఎరుకల సామాజిక వర్గం నుంచి సత్యనారాయణను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి గవర్నర్‌కు పంపిస్తే ఆమె తిరస్కరించారని పేర్కొన్నారు. ఎరుకల సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకాలు వేసింది గవర్నర్ తమిళిసై అని పేర్కొన్నారు. ఆమె కారణంగానే ఆ కులానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాంచరమ్మ జాతరకు కేసీఆర్ పది లక్షలు ఇచ్చే వారన్నారు. జాతర్లకు బోనాలకు, అన్ని పండుగలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిన అంశాన్ని ఆమె గుర్తు చేశారు. అన్ని కుల సంఘాల వారికి కేసీఆర్ సముచిత స్థానం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భూపాల్ రెడ్డి, పోరెడ్డి పద్మ, కామేష్ రెడ్డి, ఎరుకల సంఘం నాయకుడు నాగయ్య, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

