MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
MLC Elections | తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి 20వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.

తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్ రెడ్డి, మల్లేశం ఎగ్గే, మీర్జా రియాజుల్ హాసన్ ఎఫెందీ.. ఏపీలో కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరచూరి అశోక్ బాబు, బి. తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీకాలం మార్చి 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. 11వ తేదీన స్క్రుటినీ ఉంటుంది. మార్చి 13వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువునిచ్చారు. ఇక మార్చి 20 వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ చేపడతారు. మార్చి 24వ తేదీలోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

Mlc Elections
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!