దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా, దేశం గర్వించే రీతిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను నిర్వహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.
-
డిప్యూటీ కలెక్టర్ల భేటీలో మంత్రి వాకిటి శ్రీహరి పిలుపు
-
203 కోట్లతో భారీ ఏర్పాట్లు.. 103 కోట్లతో మౌలిక వసతులు
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా, దేశం గర్వించే రీతిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను నిర్వహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. బేగంపేటలోని టూరిస్ట్ ప్లాజాలో ఖేలో ఇండియా ఏర్పాట్లపై వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడాశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ప్రత్యేక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ కృషితోనే ఈ క్రీడల నిర్వహణ అవకాశం తెలంగాణకు దకిందని పేర్కొన్నారు.
యువతను క్రీడల వైపు మళ్లించాలి
నేటి యువతరం సోషల్ మీడియా రీల్స్, వినాశకరమైన బెట్టింగ్ మహమ్మారి బారినపడి సమయాన్ని వృథా చేసుకుంటున్నదని మంత్రి శ్రీహరి ఆందోళన వ్యక్తంచేశారు. వారిని ఈ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చి మైదానాల వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అన్నారు. ఖేలో ఇండియా నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.203 కోట్లను వెచ్చిస్తున్నదని, అందులో రూ.120 కోట్లతో క్రీడా మౌలిక వసతులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని స్పెషల్ సీఎస్ వాణీ ప్రసాద్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

