తాటాకు చప్పుళ్లకు భయపడం : మంత్రి తలసాని
talasani srinivas yadav | తాటాకు చప్పుళ్లకు భయపడబోమని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని
హైదరాబాద్ : తాటాకు చప్పుళ్లకు భయపడబోమని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొంటామన్నారు. ఈ దాడులను ముందే ఊహించామని, సీఎం కేసీఆర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు వ్యవస్థలు మీచేతుల్లో ఉండొచ్చు.. రేపు మా చేతుల్లో ఉండవచ్చన్న ఆయన.. లక్ష్యం చేసుకొని దాడులు చేయడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, దేశ చరిత్రలో ఇలాంటి విధానాలను ఎప్పుడూ చూడలేదన్నారు.
లక్ష్యంగా చేసుకున్న దాడులకు టీఆర్ఎస్ నాయకత్వం భయపడదని స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామని, ప్రజలను చైతన్యం చేసి ఏంటనేది వ్యవస్థలకు చూపిస్తామన్నారు. అంత భయపడితే హైదరాబాద్‌లో ఎందుకుంటామన్న మంత్రి.. ఏం జరుగుతుందో భవిష్యత్‌లో చూస్తారన్నారు. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామని, 15 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

