నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ
Minister Srinivas goud | నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నేటి నుంచి 18వ తేదీ వరకు

హైదరాబాద్ : నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నేటి నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. దరఖాస్తుల ధర, లైసెన్స్ ఫీజు పెంచలేదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా పోటీ పడొచ్చు అని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ కూడా తగ్గించామన్నారు. ప్రభుత్వానికి డబ్బు చెల్లించే వాయిదాలు కూడా పెంచామని పేర్కొన్నారు. స్థానికులకే దుకాణాలు దక్కేలా చర్యలు చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు
దేశంలో ఎక్కడ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, గౌడ్ లకు రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మద్యం షాప్‌లో మాఫియా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అప్పట్లో కల్తీ, విదేశీ మద్యం అమ్మేవారు కానీ ఇప్పుడు అలా లేదు అని స్పష్టం చేశారు. గుడుంబాను నియంత్రించామని తెలిపారు. దురదృష్టవశాత్తు పక్క రాష్ట్రాల్లో గంజాయి పండిస్తున్నారు దానిపై నిఘా పెట్టామని మంత్రి పేర్కొన్నారు. గంజాయి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. విదేశాల నుండి వచ్చే డ్రగ్స్ పై కూడా నిఘా ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

