Minister Srinivas Goud | బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Minister Srinivas Goud | ప్రతి ఇంటికీ సంక్షేమం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, పాలమూరును కడుపు నింపే జిల్లాగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3 : ప్రతి ఇంటికీ సంక్షేమం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, పాలమూరును కడుపు నింపే జిల్లాగా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రికి క్రేన్ సాయంతో భారీ గజమాలను వేశారు. అనంతరం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో వడ్డెరబస్తీ అంటే ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉండేదని, నేడు పట్టణంతో సమానంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. లొల్లి పెట్టి కాలయాపనతో రాజకీయం చేసేవారికి అభివృద్ధి గురించి తెలియదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ భవనంలో వివిధ సదుపాయల నిమిత్తం రూ.5 లక్షలు కేటాయించనున్నట్లు వివరించారు. బీసీలకు విడుతల వారిగా బీసీబంధు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, కౌన్సిలర్ రవికిషన్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

