హైదరాబాద్ జేటీసీపై ఆటో జేఏసీ నేత దాడి
హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీ రమేశ్‌పై ఆటో యూనియన్ జేఏసీ నాయకుడు మహ్మ ద్ అమానుల్లాఖాన్ గురువారం దాడికి పాల్పడ్డాడు.
- పోలీసులకు నిందితుడి అప్పగింత
- నేడు రవాణా ఉద్యోగుల పెన్‌డౌన్
- దాడిని ఖండిస్తున్నా: మంత్రి పొన్నం
ఖైరతాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీ రమేశ్‌పై ఆటో యూనియన్ జేఏసీ నాయకుడు మహ్మ ద్ అమానుల్లాఖాన్ గురువారం దాడికి పాల్పడ్డాడు. ఆటోలకు మీటర్లు బిగించాలని కోరు తూ ఖైరతాబాద్‌లోని జేటీసీ కార్యాలయంలోకి వెళ్లిన అతడు పలు సమస్యలపై జేటీసీతో చర్చించాడు. వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని జేటీసీ హామీచ్చారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అమానుల్లాఖాన్ జేటీసీ దగ్గరికి వెళ్లి చెంపపై చెయ్యి చేసుకున్నాడు. ఆ సమయంలో వారిద్ద రే గదిలో ఉన్నారు.
కంగుతున్న జేటీసీ.. హెల్ప్.. అని గట్టిగా అరిచారు. వెంటనే సిబ్బంది లోపలికి పరుగెత్తుకొచ్చి అమానుల్లాఖాన్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జేటీసీ ఫిర్యాదుతో ఖైరతాబాద్ పోలీసులు అమానుల్లాఖాన్‌పై కేసు నమోదు చేశారు. ఆర్టీఏ సిబ్బంది, ఉద్యోగ సంఘాలు దాడిని ఖండించాయి. జేటీసీపై దాడిని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఉద్యోగులపై దాడులు సరికాదన్నారు. పోలీసులతో మాట్లాడి దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రూప్1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ఖైరతాబాద్ ఆర్టీవో పురుషోత్తంరెడ్డి, నాగోల్ ఆర్టీవో రవీందర్ కోరారు.
నేడు పెన్ డౌన్
జేటీసీపై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు పెన్‌డౌన్‌కు దిగారు. ఈ నిరసనకు అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు పలికాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీవో కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని ఉద్యోగ సంఘం నాయకులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

