యాదాద్రికి మంత్రి మల్లారెడ్డి 3 కిలోల బంగారం విరాళం
Yadadri | ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం కోసం రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి భూరి విరాళాన్ని అందించారు. 3 కిలోల బంగారం విలువ చేసే నగదును

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం కోసం రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి భూరి విరాళాన్ని అందించారు. 3 కిలోల బంగారం విలువ చేసే నగదును ఆలయ అధికారులకు మంత్రి మల్లారెడ్డి గురువారం ఉదయం అందజేశారు. మేడ్చల్ నియోజకవర్గం తరపున మూడు కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. తన కుటుంబం తరపున కిలో బంగారం, నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ తరపున 2 కిలోల బంగారం సమర్పించినట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
మంత్రి మల్లారెడ్డి మొత్తం రూ. 1.75 కోట్ల నగదు అందించారు. ఇందులో రూ. కోటి నగదు కాగా, రూ. 75 లక్షల విలువైన చెక్కులు ఉన్నాయి.
ఘట్కేసర్లోని క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు యాదాద్రికి ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి ఆలయ ఈవో గీత, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆ నగదును మంత్రి అందజేసి, స్వామి వారిని దర్శించుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

