హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. పెట్టుబడులే లక్ష్యంగా దాదాపు 15 రోజుల పాటు అమెరికా(America), లండన్ దేశాల్లో(London Tour) కేటీఆర్(Minister KTR) పర్యటించారు.
ఈ విదేశీ పర్యటనలో భాగంగా ఆయా కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తల(Industrialists)తో పాటు ఐటీ ప్రముఖులను, ఆయా దేశాలకు చెందిన ప్రజాప్రతినిధులను కేటీఆర్ కలిసి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల(Investment )కు ఉన్న అవకాశాలను సవివరంగా తెలిపారు.
సుమారు 42 వేల ఉద్యోగ, ఉపాధి కల్పనతో రాష్ట్రానికి తిరిగి వస్తున్న కేటీఆర్కు.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ‘ వెల్కమ్ టు అవర్ డైనమిక్ లీడర్ కేటీఆర్ ’అంటూ ఓఆర్ఆర్(ORR)తో పాటు పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ యువజన నాయకులు భారీ హోర్డింగ్స్ ఫ్లెక్సీ(Flexi)లు, బ్యానర్ల(Banners)ను ఏర్పాటు చేశారు. తెలంగాణ యువతకు 42 వేల ఉద్యోగ అవకాశాలతో వస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొనడం జరిగింది.