సబితకు డబుల్ బెడ్రూం, ఆటో
ఉండటానికి.. డబుల్ బెడ్రూం ఇల్లు, ఆర్థికంగా నిలదొక్కుకోడానికి.. ఆటో, చదువుకుంటానంటే.. సహాయం చేస్తానని హామీ, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా. మంత్రి కే తారకరామారావు ఓ పేద యువతికి ఇచ్చిన ధైర్యం
నల్లగొండ యువతికి అండగా మంత్రి కేటీఆర్
కుటుంబపోషణకు ఆటో నడుపుతున్న ఇంటర్ విద్యార్థిని
హైదరాబాద్, ఫిబ్రవరి 9 : ఉండటానికి.. డబుల్ బెడ్రూం ఇల్లు, ఆర్థికంగా నిలదొక్కుకోడానికి.. ఆటో, చదువుకుంటానంటే.. సహాయం చేస్తానని హామీ, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా. మంత్రి కే తారకరామారావు ఓ పేద యువతికి ఇచ్చిన ధైర్యం. కుటుంబ పెద్దగా, అన్నగా తీసుకొన్న బాధ్యత ఇది. నల్లగొండకు చెందిన సబిత తండ్రి కొన్నేండ్ల కిందటే చనిపోయాడు. తల్లి ఇండ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. ఆమె కష్టాన్ని చూడలే సబిత కూడా తోడుగా ఉండాలనుకొన్నది. కష్టపడి నేర్చుకొని ఆటో నడుపుతున్నది. విషయం తెలుసుకొన్న మంత్రి కేటీఆర్.. సాయం అందిస్తానని ముందుకొచ్చారు. బుధవారం సబితను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని డబుల్ బెడ్రూం ఇంటితో పాటు, కొత్త ఆటో మంజూరీకి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. చదువుకుంటానంటే అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, సబిత కుటుంబానికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
యువతులకు సబిత ఆదర్శం
మహిళలు తలచుకొంటే ఏదైనా సాధించగలరని, పట్టుదల ఉంటే కష్టాలను ఎదుర్కోవడం అసాధ్యం కాదని సబిత నిరూపించింది. ఎంతో ధైర్యంతో కుటుంబానికి అండగా నిలిచిన ఆమె తీరు యువతులకు స్ఫూర్తినిస్తుంది. – మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ సాయాన్ని ఎన్నటికీ మర్చిపోను
మంత్రి కేటీఆర్ మా కుటుంబానికి అండగా నిలవడం నాకు ఎన్నో రెట్ల ధైర్యాన్నిచ్చింది. మమ్మల్ని ప్రగతిభవన్‌కు పిలిపించుకోవడమే కాకుండా కుటుంబ యోగక్షేమాలు తెలుసుకోవడం, సహాయం అందించడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. కేటీఆర్ అందించిన ధైర్యం, భరోసాతో భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను చేరుకొంటా. – సబిత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

