ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీల అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశం
లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మంత్రి కేటీఆర్ అమెరికాలో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీలై ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ (జేఅండ్‌జే), జీఎస్కే అధిపతులతో శనివారం ఆయన సమావేశమయ్యారు.
లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మంత్రి కేటీఆర్ అమెరికాలో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీలైన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ (జేఅండ్‌జే), జీఎస్కే అధిపతులతో శనివారం ఆయన సమావేశమయ్యారు.
మొదట ఫైజర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చైర్మన్ డాక్టర్ ఆల్బర్ట్ బౌర్లా, కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ గ్లోబల్ సప్లై ఆఫీసర్ మైక్ మెక్‌డెర్మాట్‌తో చర్చలు జరిపారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్‌రంగం పురోగతిని వివరించారు. అలాగే, ఇండియాలో హెల్త్‌కేర్, ఫార్యాస్యూటికల్ రంగానికి సంబంధించి ఫైజర్ కంపెనీ వ్యూహాలు, ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ఉవే స్కోన్‌బెక్‌తో కూడా సమావేశమయ్యారు.

రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో హైదరాబాద్ ఎకోసిస్టంను తెలియజేసేందుకు మంత్రి కేటీఆర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మథాయ్ మామెన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మరో అతిపెద్ద ఫార్మా కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్కే) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆగం ఉపాధ్యాయ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ సామర్థ్యాలను వివరించారు.
మంత్రి వారితో లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన తన విజన్‌ని పంచుకున్నారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడంలో సహాయపడే సాధ్యమైన మార్గాలు, కార్యక్రమాలపై సూచనలను కోరారు. ఫిబ్రవరి 2023లో హైదరాబాద్‌లో జరగనున్న 20వ బయో ఏషియా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించారు. కాగా, మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్‌తోపాటు ఇన్నోవేషన్‌పై దృష్టి సారించి లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫార్మా కంపెనీల అధిపతులు మెచ్చుకున్నారు. ఈ సమావేశాల్లో మంత్రి కేటీఆర్‌తోపాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శ్రీ శక్తి ఎం. నాగప్పన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- america tour
- gsk
- J&J
- Minister KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

