95 వేల కుటుంబాలకు 4,770 కోట్లు
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చనిపోయిన రైతులకు రూ.5 లక్షలు ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు.
- 40 లక్షల మంది రైతులకు రైతు బీమా వర్తింపు
- బీజేపీ కార్యకర్తకూ సాయం
- ట్విట్టర్లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చనిపోయిన రైతులకు రూ.5 లక్షలు ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆలోచనతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ కారణాలతో చనిపోయిన 95,416 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4,770.80 కోట్ల సాయం అందిందని సోమవారం మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. రైతు బీమా పథకం కింద 40 లక్షల మందికి రైతులకు బీమా చేయించామని వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో చనిపోయిన రైతు, బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి రూ.5 లక్షల చెక్కును అందించిన స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన పార్టీ కార్యకర్త గజ్జి మల్లికార్జున్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆయన కుటుంబానికి వ్యక్తిగతంగా అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- BJP worker
- Minister KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

