ఐఐటీ విద్యార్థిని అంజలి చదువుకి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం

హైదరాబాద్ : వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి. రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే కుటుంబ పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా మంత్రి కేటిఆర్‌ను కోరింది. మేకల అంజలి పేదరిక పరిస్థితులను తెలుసుకున్న మంత్రి తన వ్యక్తిగత హోదాలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆమె ఫీజులకు అవసరమైన నిధులను అందిస్తూ వస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది, రానున్న సంవత్సరానికి సంబంధించిన ఐఐటీ ఫీజుల మొత్తాన్ని బుధవారం అంజలి కుటుంబానికి మంత్రి అందించారు.
ఈ సందర్భంగా అంజలి చదువు, భవిష్యత్ ప్రణాళికల గురించి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. తమ కూతురు ఐఐటీ విద్యకు సంబంధించిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం మంత్రి కేటీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

