Minister KTR | హరీశ్వర్ రెడ్డి మృతిపట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సంతాపం
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి (Koppula Harishwar reddy) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి (Koppula Harishwar reddy) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) సంతాపం వ్యక్తం చేశారు. పరిగి ప్రాంతానికి ఆయన ఎన్నో సేవలు అందించారన్నారు. ఆయన ఆత్మకు శాతి కలగాలని ప్రార్థించారు. హరీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్వర్ రెడ్డి మృతిపట్ల మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సంతాపం వ్యక్తంచేశారు. పరిగి ఎమ్మెల్యేగా, ఉప సభాపతిగా, సీనియర్ రాజకీయ నేతగా గొప్ప సేవలు అందించారని చెప్పారు. ఆయన కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
హరీశ్వర్ రెడ్డి మృతిపట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి, జిల్లాకు తీరన లోటన్నారు. రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నారు. హరీశ్వర్ రెడ్డి మృతదేహానికి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నివాళులర్పించారు. శనివారం ఉదయం వికారాబాద్లోనని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి మహేందర్ రెడ్డి.. ఆయన భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. హరీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్గా, పరిగి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, ఎప్పీలకు మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.
కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరణంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లా రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

