Minister Koppula | కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు మానుకోవాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్
Minister Koppula | కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలు మానుకోవాలి. ఆ పార్టీ తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలే తగినరీతిలో బుద్ధి చెబుతారాని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar reddy) పై హత్యాయత్నాన్ని మంత్రి ఖండించారు.
పెద్దపల్లి : కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు మానుకోవాలి. ఆ పార్టీ తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలే తగినరీతిలో బుద్ధి చెబుతారాని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar reddy) పై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రి ఖండించారు. మంగళవారం ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఎన్నికల్లో గెలువలేమనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దురాఘాతాలకు పాల్పడుతుందని విమర్శించారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని చట్టబద్ధంగా శిక్షిస్తామన్నారు. కాగా, ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బంద్(Dubbaka bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది.
వ్యాపార సంస్థలు, దుకాణాలు, పాఠశాలలు, మార్కెట్లు స్వచ్ఛందంగా మూసివేశారు. దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

