Minister Komatireddy | నేషనల్ హైవే-44ను 12 లేన్లుగా విస్తరిస్తాం : మంత్రి కోమటిరెడ్డి
Minister Komatireddy | జాతీయ రహదారి-44ను(National Highway-44) 12 లేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy) వెల్లడించారు.
జడ్చర్ల టౌన్, జూలై 15 : జాతీయ రహదారి-44ను(National Highway-44) 12 లేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy) వెల్లడించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్, రాజాపూర్, నవాబ్‌పేట, మిడ్జిల్ మండలాల్లో రూ.118 కోట్ల నిధులతో చేపట్టిన డబుల్‌లేన్ బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సాయంతో 44వ హైవే విస్తరకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించినట్లు తెలిపారు.
తుక్కుగూడ నుంచి శ్రీశైలం రహదారి విస్తరణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యమంత్రి సహకారం తో ప్రత్యేక నిధులను కేటాయించి జిల్లాలో డబుల్‌లేన్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో డబుల్‌లేన్ రోడ్లు, బైపాస్ రోడ్ల అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జడ్చర్ల నుంచి భూత్పూరు వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఓవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతోపాటు మరోవైపు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు వివరించారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

