Minister Jagadish Reddy | మైనార్టీల సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy | మైనార్టీల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలించిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని పి.ఎస్.ఆర్ సెంటర్ వద్ద గల చిన మజీద్ సమీపంలో రూ. 80లక్షల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశారు.
సూర్యాపేట : మైనార్టీల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలించిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని పి.ఎస్.ఆర్ సెంటర్ వద్ద గల చిన మజీద్ సమీపంలో రూ. 80లక్షల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి తప్పా వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు.
స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనార్టీల బతుకులు మారలేదు. వారి జీవితాల్లో వెలుగులు కానరాలేదన్న మంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లిం సోదరుల జీవితాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు.
షాదీముబారక్, మైనారిటీ గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఇమామ్, మౌజన్‌కు గౌరవవేతనం, హజ్ యాత్రికులకు ఏర్పాట్లు, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణలాంటి అనేక కార్యక్రమాలు మైనారిటీల ప్రగతికి మైలురాయిగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, మౌలానా అత్తర్ సాబ్, గాయాజ్ బాయ్, ఆఫీజ్ ఖాలీల్ సాబ్, రియాజ్, కౌన్సిలర్లు తాహెర్ పాష, జహీర్, గండూరి రాధిక, షాదీ ఖానా చైర్మన్ సయ్యద్ సలీం, షాహద్ మౌలానా, అజీజ్, గౌస్ ఖాన్, తాహేర్, గౌస్, నజీర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

