Minister Jagadish reddy | అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి : మంత్రి జగదీశ్ రెడ్డి
Minister Jagadish reddy | సూర్యాపేట పట్టణాన్ని(Suryapeta) అందంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నం, అభివృద్ధికి ప్రజలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy) కోరారు.
సూర్యాపేట : సూర్యాపేట పట్టణాన్ని(Suryapeta) అందంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నం, అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy) కోరారు. పట్టణంలోని 15, 34వ వార్డులల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.
పార్టీలకు అతీతంగా అభివృద్ధిని చేపడుతున్నామని తెలిపారు. 2014 కు ముందు , ప్రస్తుతం సూర్యాపేట లో ఉన్న పరిస్థితులను గమనించాలని కోరారు. శంకుస్థాపన చేసిన బ్రిడ్జిలను నెల రోజులు లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana government) అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు కళ్లలాగా చూస్తూ ముందుకు వెళ్తుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు ఎలిమినేటి అభయ్, మడిపల్లి విక్రమ్, భరత్ మహాజన్, జ్యోతి కరుణాకర్, రంగినేని లక్ష్మణ్ రావ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్య నారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు, రాష్ట్ర కార్యదర్శి వై. వీ, రాష్ట్ర నేతలు ఉప్పల ఆనంద్, గుర్రం సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

