నార్సింగిలో టీ – డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభం
రంగారెడ్డి : జిల్లా పరిధిలోని నార్సింగిలో టీ – డయాగ్నోస్టిక్ హబ్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. టీ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ను కూడా మంత్రి ఆవిష్కరించారు. వైద్య పరీక్షల వివరాలను మొబైల్ యాప్‌లోనే తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో విప్లవాత్మకమైన చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఒకప్పుడు ఉస్మానియా, గాంధీతోపాటు పీహెచ్‌సీలకు వెళ్లేవారు. బస్తీల్లోని నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. రక్త, మూత్ర, ఎక్స్‌రేతో పాటు ఇతర పరీక్షల నిమిత్తం ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 20 రేడియోలజీ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రేడియోలజీ ల్యాబ్ నార్సింగ్‌లో ప్రారంభించుకున్నాం. ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్, 2డీ ఎకో, మెమోగ్రఫీ సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉచితంగా 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో 137 పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఇప్పటికే 24.71 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. టీ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్‌ల కోసం యాప్ ఆవిష్కరించామని తెలిపారు. వైద్య పరీక్షల ఫలితాలను యాప్‌లో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. పెరిగిన అవసరాల మేరకు నగరంలో 4 కొత్త ఆస్పత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కిడ్నీ, లివర్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలతో పాటు ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్స అందిస్తున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

