గట్టిగా.. అల్కగ..

- ధృడమైన బీటా టైటానియం మిశ్రమం తయారీ
- హైదరాబాద్లోని డీఎంఆర్ఎల్ ఘనత
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): తక్కువ బరువు ఉండి, ఎక్కువ గట్టిదనం ఉన్న మెటాస్టేబుల్ బీటా టైటానియం మిశ్రమాన్ని హైదరాబాద్లోని డీఆర్డీవోకు చెందిన డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎంఆర్ఎల్) అభివృద్ధి చేసింది. ఈ లోహ మిశ్రమం(Ti-10V-2Fe-3Al)తో విమానయాన రంగానికి చెందిన వస్తువులను తయారుచేయవచ్చు. ల్యాండింగ్ గేర్, డ్రాప్ ఇన్ ల్యాండింగ్ గేర్ వంటి విమాన విడిభాగాలను ఈ మిశ్రమాన్ని ఉపయోగించి తక్కువ బరువుతో రూపొందించవచ్చని డీఆర్డీవో అధికారులు తెలిపారు. థర్మో మెకానికల్ ప్రాసెసింగ్, అల్ట్రాసోనిక్ నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్, హీట్ ట్రీట్మెంట్ వంటి అనేక పరీక్షలు నిర్వహించి దాని ధృడత్వాన్ని పరిశీలించినట్టు వెల్లడించారు. విమాన తయారీకి వాడే 15 రకాల స్టీల్ పదార్థాలను ఈ లోహ మిశ్రమంతో భర్తీ చేసుకొనే వీలుందని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. దాంతో 40 శాతం వరకు బరువు తగ్గుతుందని వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- beta titanium
- metal
- titanium
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

