అన్ని పశువైద్య శాలల్లో మందులు అందుబాటులో ఉండాలి : మంత్రి తలసాని
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మత్స్య భవన్ నుంచి అన్ని జిల్లాల పశువైద్యాదికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గొర్రెల పంపిణీలో అర్హులైన లబ్ధిదారులు అందరు 10 రోజులలో డీడీలు చెల్లించే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో 554 పశువైద్యశాలలను అభివృద్ధి చేశాం. అవసరమైన ప్రాంతాలలో నూతన పశువైద్య శాలల నిర్మాణం చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ పశుసంవర్ధక శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో మరణించిన జీవాలకు విపత్తుల నిర్వహణ శాఖ నుంచి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. గొర్రెల పెంపకం దారులకు మేలు చేసే విధంగా అన్ని సౌకర్యాలతో గొర్రెల మార్కెట్ ల ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini Trailer | పగలు కోర్టులో స్టెనోగ్రాఫర్, రాత్రి రొమాంటిక్ రచయిత.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్!
Bomb Cyclone effect | బాంబ్ సైక్లోన్‌తో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు..!
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

