వైద్యుడిపై దాడి?
డీఎంఈ కార్యాలయం ఆవరణలోనే ఓ డాక్టర్‌పై మెడికల్ జేఏసీ నేతలు దాడి చేశారు. హైదరాబాద్‌లో పాతుకుపోయినవారికి బదిలీల్లో స్థానచలనం కల్పించి, జిల్లాల్లో ఉన్నవారికి అవకాశం కల్పించాలని కోరేందుకు వచ్చిన డాక్టర్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.
- పిడిగుద్దులతో విరుచుకుపడ్డ మెడికల్ జేఏసీ నేతలు
- డీఎంఈ కార్యాలయం ఆవరణలోనే ఘటన
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : డీఎంఈ కార్యాలయం ఆవరణలోనే ఓ డాక్టర్‌పై మెడికల్ జేఏసీ నేతలు దాడి చేశారు. హైదరాబాద్‌లో పాతుకుపోయినవారికి బదిలీల్లో స్థానచలనం కల్పించి, జిల్లాల్లో ఉన్నవారికి అవకాశం కల్పించాలని కోరేందుకు వచ్చిన డాక్టర్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. బాధితుడు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. నా గర్ కర్నూల్ జిల్లా మెడికల్ కాలేజీలోని ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ శేఖర్ శుక్రవారం డీఎంఈ కార్యాలయానికి వచ్చారు.
ఆయన ఆఫీస్‌లో అడుగు పెడుతుండగా.. తెలంగాణ ప్రభుత్వ వైద్య సంఘం/మెడికల్ జేఏసీ నేతలు డాక్టర్ బొంగు రమేశ్, డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ వినోద్‌తోపాటు మరికొందరు ఆయనపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. టీ కప్పులతో తలపై కొట్టారని, కింద పడేశారని పేర్కొన్నారు. దాంతో డాక్టర్ శేఖర్ అక్కడే బైటాయించారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగే వరకు ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు.
దాడి ఘటనపై డీఎంఈ డాక్టర్ వాణికి ఫిర్యాదు చేశానన్నారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని డీఎంఈకి వినతి పత్రం ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై డాక్టర్ బొంగు రమేశ్ స్పందించి తాము డాక్టర్ శేఖర్‌పై ఎలాంటి దాడి చేయలేదని చెప్పారు. ఆయన కొన్ని రోజులుగా తమ సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తమను దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

