రోబోటిక్ సర్జరీతో భారీ ఫైబ్రాయిడ్ తొలగింపు
- విజయవంతంగా పూర్తిచేసిన కిమ్స్ వైద్యులు
బేగంపేట్ జూన్ 1: అత్యంత భారీ పరిమాణంలో ఫైబ్రాయిడ్ ఉన్న ఓ మహిళ (45)కు కిమ్స్ దవాఖాన వైద్యులు రోబోటిక్ సర్జరీతో ఊరట కల్పించారు. హైదరాబాద్‌కు చెందిన ఆ మహిళ.. కొద్దిగా తిన్నా కడుపు నిండిపోయినట్టుగా అనిపించడం, మూత్ర విసర్జన నెమ్మదించడం లాంటి సమస్యలతో 3 నెలల నుంచి బాధపడుతున్నది. ఆమె కడుపులో 21X10X18 సెం.మీ. పరిమాణంలో భారీ ఫైబ్రాయిడ్ ఉన్నట్టు కిమ్స్ వైద్యులు గుర్తించారు.
గర్భాశయ ముఖద్వారం వైపు నుంచి ఉదరంలో పైభాగం వైపు విస్తరించిన ఈ ఫైబ్రాయిడ్ వల్ల గర్భాశయంలో, మూత్రపిండాల్లో వాపు ఏర్పడినట్టు తేల్చారు. సాధారణంగా పెద్ద సైజులో ఉండే ఫైబ్రాయిడ్లను తొలగించేందుకు ఓపెన్ సర్జరీ పద్ధతిని అనుసరిస్తారు. కానీ, కిమ్స్‌లో రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున కుటుంబసభ్యుల అంగీకారంతో బాధిత మహిళకు మే 17న విజయవంతంగా రోబోటిక్ సర్జరీ నిర్వహించారు.
కడుపు కింది భాగంలో చిన్న కోత పెట్టి ఫైబ్రాయిడ్తోపాటు గర్భాశయాన్ని తొలగించారు. ఆ తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడంతో మే 20న ఆమెను డిశ్చార్జి చేసినట్టు లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బిందుప్రియ గురువారం వెల్లడించారు. ఈ సర్జరీని రోబో అసిస్టెడ్ మయోమెక్టమీ విత్ హిస్టరెక్టమీ అంటారని వైద్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

