Weavers dharna | సిరిసిల్లలో చేనేత కార్మికుల భారీ ధర్నా
Weavers dharna | కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు(Weavers) రోడ్డె క్కాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా సిరిసిల్ల(Siricilla) నేత కార్మికులు ఆందోళనకు దిగారు. ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని బీవైనగర్‌లో చేనేత జౌళిశాఖ ఎదుట భారీ ధర్నా(Massive dharna) చేశారు.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు(Weavers) రోడ్డె క్కాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా సిరిసిల్ల(Siricilla) నేత కార్మికులు ఆందోళనకు దిగారు. ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని బీవైనగర్‌లో చేనేత జౌళిశాఖ ఎదుట భారీ ధర్నా(Massive dharna) చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇవ్వడం వల్ల వేలాది మంది కార్మికులకు చేతి నిండా పని లభించిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల తయారీ బంద్ చేయడం వల్ల ఉపాధి పనిలేక అనేక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయన్నారు. వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధార పడ్డ వేలాది మంది కార్మికుల కుటుంబాలు నేడు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయన్నారు. కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం బాధాకరమన్నారు.
కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలని పలుమార్లు కలెక్టర్, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదన్నారు. వెంటనే యారన్ సబ్సిడీ విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్కర్‌టూ ఓనర్ పథకాన్ని అమలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, అన్నల్దాస్ గణేశ్, నక్క దేవదాస్, కూచన శంకర్, మల్లారెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

