హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రైస్‌బ్రాన్ ఆయిల్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని పలువురు వక్తలు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రైస్ బ్రాన్ ఆయిల్’ (ఐసీఆర్బీవో) ఏడో సదస్సు ప్రారంభమైంది. రైస్ బ్రాన్ ఆయిల్ ద్వారా కలిగే ప్రయోజనాలపై ఈ సదస్సులో విస్తృత చర్చ జరిగింది. వక్తలు మాట్లాడుతూ.. మంచి ఆరోగ్యం కోసం సరైన వంటనూనెను ఎంచుకోవాలని సూచించారు.
రైస్‌బ్రాన్ నూనెలో గామా-ఒరిజానాల్ సమృద్ధిగా ఉంటుందని, ఇది చెడు కొవ్వును తగ్గించడంలో, మంచి కొవ్వును పెంచడంలో సహాయం చేస్తుందని వివరించారు. జీవక్రియ రేటు పెరిగి, గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుందని తెలిపారు. సదస్సులో ఐఏఆర్బీవో ప్రెసిడెంట్ అశోక్ సేథియా, కన్వీనర్ డాక్టర్ ప్రబోధ్ హల్డే, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ ఝున్‌ఝున్‌వాలా, థాయిలాండ్ నుంచి డాక్టర్ రియాంటాంగ్ సింగనుసాంగ్, డాక్టర్ సాలిస్, నర్చర్ హెల్త్ సొల్యూషన్స్ ఫౌండర్ డాక్టర్ రోహిణి శర్మ తదితరులు పాల్గొన్నారు.