హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కాస్ట్లీ బైక్లు ఉన్నా వద్దంటాడు.. హోండా యాక్టివా మాత్రమే టార్గెట్ అంటాడు.. ఎందుకిలా అంటే, ‘నా ఎత్తు 5 అడుగులు, బక్కగా ఉంటా. పెద్ద బైక్లను దొంగతనం చేసి, అవి నడపరాక ఎందుకు అవస్థలు.
నా ఎత్తుకు, నా బరువుకు హోండా యాక్టివాలే కరెక్ట్’ అని సమాధానమిస్తాడు. అలా దాదాపు 9 హోండా యాక్టివాలు, ఓ టీవీఎస్ స్కూటీని దొంగతనం చేశాడు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కుసరాజు అలియాస్ నందగోపాల్. ఇతడిని మంగళవారం మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సూపర్ మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లోని పార్కింగ్ స్థలాల్లో యాక్టివాలకు తాళం పెట్టి మర్చిపోతే, ఆ వాహనాలను దొంగిలిస్తానని చెప్పాడు.