IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
మల్కాపురం ఐటీ పార్కులోని ‘ఆక్సి సె’ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధి దండు మల్కాపురం ఐటీ పార్కులోని ‘ఆక్సి సె’ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్‌లోకి ఆక్సిజన్ నింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో సిలిండర్ రెండు ముక్కలుగా విడిపోయి సుమారు 200 మీటర్ల దూరంలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు.
ఈ ప్రమాదంలో కంపెనీలోడెయిలీ లేబర్‌గా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ కుమార్ (21) మృతి చెందాడు. అదేవిధంగా దండు మైలారం గ్రామం, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మాథరి హరిప్రసాద్ (23) గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

