మహా శివరాత్రి జాతర ఉత్సవాలను పక్కాగా నిర్వహించాలి : మంత్రి ఎర్రబెల్లి
జనగాం : పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర ఉత్సవాలు పక్కాగా నిర్వహించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతరపై సంబంధిత, వివిధ శాఖల అధికారులతో పాలకుర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అత్యంత మహిమాన్విత క్షేత్రంగా పాలకుర్తికి పేరుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా శంకరుడు, విష్ణువు వేర్వేరుగా స్వయంభువులుగా వెలసిన క్షేత్రం లేదు. ఇలాంటి క్షేత్రం వల్ల, తొలి తెలుగు కవి, ఇక్కడి పాల్కురికి సోమనాథ కవి వల్ల ఈ ప్రాంతానికి మంచి పేరు గుర్తింపు ఉంది.
ఈ ప్రాంతం ఎంతో చరిత్రాత్మకం. ప్రతి ఏటా మహా శివరాత్రి సందర్భంగా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం.
ఈ సారి కూడా ఘనంగా జాతర ఏర్పాట్లు పక్కాగా జరగాలి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు . టూరిజం కింద పాలకుర్తి దేవాలయానికి రూ. 15 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. దేవాలయ మంటపానికి గ్రానైట్ వేస్తున్నారు.
గిరి ప్రదక్షిణ రోడ్లకు లైట్స్ పెట్టాలి. మసీదు దగ్గర రోడ్డుకు సీసీ వేయాలి. జనగామ, వరంగల్, తొర్రూరు, సూర్యాపేట ఇతర రహదారుల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. రోడ్లకు ఇరువైపులా మట్టి పోసి బాగు చేయాలి. మిషన్ భగీరథ ద్వారా 24 గంటలపాటు మంచినీరు, ఆరోగ్య శిబిరాలు, పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
అనుభవం ఉన్న అధికారుల సేవలను జాతరకు అధికారులు వినియోగించుకోవాలని సూచించారు. రామచంద్రయ్య శర్మ అధ్వర్యంలో తాత్కాలిక కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ జాతర వరకు పని చేస్తుంది. భక్తుల సదుపాయాల విషయంలో రాజీ పడొడ్డు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు, జాతర నిర్వహణ ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

